Swagatam








నమస్కారం 




"ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపలనుండు  లీనమై,
యెవ్వనియందుడిందు బర  మేశ్వరుడెవ్వడు మూలాకారణం ,
బెవ్వాడనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దాన యైనవా ,
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ ." 





ఎవనివల్ల జగములుపుట్టి ,పెరిగి నశించుచున్నవో , ఎవ్వడన్ని వస్తువులకు ప్రభువో ,
ఎవ్వడన్నిటికి మూలకారణుడో, ఎవ్వనికి మొదలు నడుమ ఆఖరు అనునవి లేవో ,
ఎవడు సర్వాత్మస్వరూపుడో ,అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుచున్నాను .  





అని వేడిన ఆ గజ రాజుకు మోక్షాన్ని ప్రసాదించిన ఓ పరమాత్మా ,నీకు నా వందనాలు . 


"పలికెడిది భాగవతమట ,పలికించు విభుండు రామభద్రుండట"
అని పోతనామత్యులు అన్నట్లు  ,


చేసేది ,చేయించేది,చూసేది ,చూపించేది,నడిచేది ,నడిపించేది ,పలికెడి పలికించేది ,

అన్నీ తానే అయిన ఆ పరమాత్మే, వయసులో చాలా చిన్నదాన్ని ,ఏమాత్రం లోకజ్ఞానం లేనిదాన్ని అయిన 
 నా చేత ఈ పని చేయించుకుంటున్నాడని విశ్వసిస్తూ ,

ఒకవేళ ఏమైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ మధ్యలో దొర్లితే అవి వాటిని పెద్ద మనసుతో మన్నించ ప్రార్థన . 


నాకు ఎందుకో ఈ రోజు శ్రీ భగవద్గీతా సారంశం చదవాలనిపించింది . 

అంతర్జాలంలో శోధించగా కొన్ని పుటలు దొరికాయి ,కానీ వాటిలో శ్లోక సహిత త్తత్పర్యాలు  వున్నాయి . 

నేను ఆ శ్లోకాలని వదలి వేసి ,సారాంశం కోసం కేవలం తాత్పర్యాలు చదువుదామనుకున్నను . 

అయితే నా లాగే ఎవరైనా కేవలం సారంశం కోసం వెతికే వాళ్ళుంటారేమో నని 
ఈ ప్రయత్నం చేస్తున్నాను . 

తప్పులుంటే మన్నించండి . 

కాని  జ్ఞాన ఖని అయిన గీతా గ్రంధాన్ని శ్లోకాలతో సహా చదివితే ఆ ఫలితమే వేరు . 


నేను ఇక్కడ ఇస్తున్న అంతర్జాల పూతల అనుసంధానాలు ,ఆయా యజమానుల అనుమతి లేకుండా ఇస్తున్నాను . 
క్షమించండి . 



ఆంగ్లం లో శ్లోక సహితం గా -

http://www.bhagavad-gita.org/


తెలుగు లో శ్లోక సహితం గా -

http://www.telugubhakti.com/telugupages/Gita/Gita.html


శ్రీ ఘంటసాల గారు గానం చేసినది -

http://www.raaga.com/player4/?id=9521,9522,9523,9524&mode=100&rand=0.15559147880412638



శ్రీ భగవద్గీత గురించి మహాత్ముల అభిప్రాయాలు 



                      


"Those of you who know Sanskrit should tomorrow, if possible today buy the Gita and begin to study the book.Those  of you who do not know Sanskrit, should study Sanskrit, if only for the sake of the Gita . I tell you that it contains treasures of knowledge of which you have no conception whatsoever."


-Mahatma Gandhi


 "మీకు సంస్కృత భాషాజ్ఞానం వుంటే వెంటనే "భగవద్గిత" ను కొని చదవండి . 
సంస్కృత భాష రాకపోతే ముందుగా సంస్కృత భాషను గీతార్ధజ్ఞానం కోసమైనా త్వరగా నేర్చుకోండి . ఎందుకోసం నే మిమ్మల్ని గీత చదవమంటున్నానంటే మీరు ఏ విధంగా ఈ జగత్తు లో కనీవినీ ఎరుగనంతటి మహాజ్ఞాన సంపదను గీత నిలయమై వుందని . "

-మహాత్మా గాంధీ




  

"GITA=Truths beautifully arranged together in their proper places like a fine garland or a bouquet of choicest flowers."

-Swami Vivekananda



  "పూల మాలలో గాని, పుష్పగుచ్చం  లో గాని ఎన్నుకొన్న చక్కని పూలని కావలసిన పద్ధతి లో కూర్చిన విధంగా గీత లో వస్తావ విషయాలు ఏర్పడ్డాయి . "


-స్వామి వివేకానంద 






Message of the Gita "BE FEARLESS!!"




"If one reads this one sloka,he gets all the merits of reading the entire Gita; for in this one sloka lies imbeded the whole message of the Gita."

-Swami Vivekananda



"ఎవరైనా పై  ఒక్క శ్లోకం చదివినట్టైతే మొత్తం గీత అంతా చదివిన గోచరమౌతుంది .ఈ శ్లోకం లో గీతార్ధ  సారం అంతా  చక్కని క్రమంగా ఇమడ్చబడింది."

-స్వామి వివేకానంద 

GITA- A miraculous remedy for life's tragedies


"When doubts haunt me, when disappointments stare me in the face and when I see not one ray of light on the horizon I turn to Bhagavadgita and find a verse to comfort me and I immediately begin to smile in the midst of overwhelming sorrow. My life has been full of external tragedies and if they had not left any visible and indelible effect on me I owe it to the teachings of Bhagavadgita."


-Mahatma Gandhi


"నా మనస్సు సందేహాలతో నిండిపోయినప్పుడు , నిరాశ ,నిస్పృహలు నా మనస్సుని క్రుంగ తీసేటప్పుడు , ఏ ఆశాకిరణం కనుచూపు మేరలో కానరాని వేళ ,ఒక్కసారి "భగవద్గిత" ను చదవడం మొదలు పెట్టానా , ఏవీ ఆ కష్టసాగర తరంగాలు ?మాయం . బాహ్య ప్రపంచం అంతా కష్టాలతో కరుడు కట్టుకుపోయిన అంతరాత్మ అంతా చెప్పలేనంత శాంతి భరితమై వుంటుంది . 
నిజంగా  ఇది అంతా ఆ గీత మూలంగా ఏర్పడినదే !దాని ప్రభావం అంతటిది."

-మహాత్మా గాంధీ 

































గమనిక :-
నేను ఇవ్వబోయే గీతా తాత్పర్యాలు నా సొంతంగా నేను అనువదించినవి  కావు.
ఒక పుస్తకం నుండి తీసుకుంటున్నవి .





  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి